మామయ్యతో బి-పాజిటివ్ !
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్’ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాగజైన్ కవర్ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు కనిపించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, రామ్ చరణ్, షాహిద్ కపూర్, ఆలియా భట్, కృతి సనన్, సమంత తదితరులు దర్శనమిచ్చారు. తమ ఫిట్‌నెస్
రహస్యాల్ని పంచుకున్నారు. ఆగస్టు మ్యాగజైన్ కవర్ ఫొటోపై మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన ట్విట్ చేసింది. మామయ్య ఫోటోలని కొన్ని షేర్ చేసింది. ఇందులో మెగాస్టార్ క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. మామయ్యని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉందని ఉపాసన పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా’ షూటింగ్ పూర్తయింది. జెడ్ స్వీడుతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి
సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైంది.సైరా
Embracing Age with Grace. The immortal Megastar Chiranjeevi nails the cover of Bpositive ! Check out Mamaya’s candid & inspiring conversation. It’s super cool 🙏🏼 really happy to be sharing this
Thanks @DabbooRatnani for this amazing shoot.👍🏻 @Apollolife #MegaStarChiranjeevi pic.twitter.com/v1K2eI41Jz— Upasana Konidela (@upasanakonidela) August 4, 2019