370 రద్దుకు మద్దతిచ్చిన, వ్యతిరేకించిన పార్టీలు ఇవే.. !
మిషన్ కశ్మీర్ ని విజయవంతంగా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. నేడు రాజ్యసభలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేసింది. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని పలు పార్టీలు స్వాగతించగా.. మరికొన్ని విభేదించాయి.
బీఎస్పీ, వైకాపా, తెదేపా ఏఐఏడీఎంకే, బిజు జనతా దళ్,ఆమ్ ఆద్మీ పార్టీలు కేంద్రం నిర్ణయానికి మద్దతుగా నిలిచాయి. తెరాస తటస్థంగా ఉంది. 370రద్దుని సపోర్టు చేస్తూగానీ, వ్యతిరేకిస్తూ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, కాంగ్రెస్, పీడీపీ, డీఎంకే,ఎండీఎంకే వ్యతిరేకించాయి. 370రద్దు చారిత్రక నిర్ణయం కాదు. తప్పిదమని అన్నాయి.
ఇక, జమ్ముకశ్మీర్ 370రద్దుతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాలుస్తూ.. స్వీట్లు పంచుకొన్నారు. హోంమంత్రి అమిత్ షాని నవయుగ సర్థార్ వల్లాభాయ్ పటేల్ గా అభివర్ణిస్తున్నారు.