అక్కడ ‘నిశబ్ధం’ ముగిసింది


స్వీటీ అనుష్క తన రేంజ్ తగిన సినిమాలు మాత్రమే చేస్తోంది. ‘భాగమతి’ తర్వాత సరైన కథ దొరక్క చాన్నాళ్లు ఖాళీగానే ఉంది. ఈ గ్యాప్ లో స్వీటీ బోలేడు కథలని వింది. వీటిలో ‘నిశబ్ధం’ కథ మాత్రమే స్వీటీని ఆకట్టుకొంది. దాన్ని ఓకే చేసింది. ‘నిశబ్ధం’ చిత్రానికి పంచ మంత్‌ మధుకర్‌ దర్శకుడు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలోని సీటెల్‌లో చిత్రీకరించారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు నిర్మాత కోన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘మునివేళ్లపై నిలబెట్టే థ్రిల్లర్‌ కథాంశాన్ని ప్రేక్షకులకు చూపించే రోజు ఎప్పుడొస్తుందా? అని ఆసక్తితో ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్రీకరణలో భాగంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా కోసం స్వీటీ సన్నబడినట్టు కనబడుతోంది. ఐతే, ఆమె పూర్తి లుక్ బయటపడకుండా జాగ్రత్తపడుతుంది. బహుశా… తన ఫిజిక్ తో ప్రేక్షకులని సప్రైజ్ చేయాలని స్వీటి భావిస్తున్నట్టుంది.