టైం లేక.. లంక బతికిపోయింది.. !

కోల్’కతా టెస్టులో శ్రీలంక బతికిపోయిందనే చెప్పుకోవాలి. ఈడెన్ గార్డెన్’లో తొలిరోజు ఆట తొలి సెషల్’లో లంక బౌలర్లు టీమిండియాకు ఝులక్ ఇచ్చారు. లక్మల్ అద్భుత బౌలింగ్ (6 ఓవర్లు.. 6మేడిన్లు.. 3వికెట్లు)తో అదరగొట్టాడు. దీంతో అప్పటి వరకు బలహీనంగా కనబడిన ప్రత్యర్థి ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. ఏకంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 100 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్’లో 171/1తో తిరుగులేని స్థితిలో ఉన్న భారత్‌ ఓ దశలో213/4కు చేరుకుంది. కెప్టెన్‌గా కోహ్లి ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ (104*) టీమిండియాని తిరిగి నెలబెట్టింది. 231 పరుగుల క్లిష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. అంపైర్లు ఆటను ఆపే సమయానికి 75కే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆటలో ఇంకా 20 ఓవర్లు మిగిలి ఉన్నా.. వెలుతురు లేమి లంక వైపు నిలిచింది. లేదంటే భారత్ మిజయాన్ని ముద్దాడేదే. మొత్తానికి తొలి టెస్టు డ్రాగా ముగిసిన టీమిండియాకు గెలిచినంత బూస్ట్ నిచ్చింది.