370రద్దుతో కశ్మీర్’కు మేలు : అమిత్ షా
జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వాడివేడిగా చర్చ అనంతరం ఈ బిల్లుని రాజ్యసభ ఆమోదించింది. చర్చలో భాగంగా ఈ బిల్లుపై అమిత్ షా వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 370, 35ఎ రద్దుతో జమ్మూ కాశ్మీర్ కు కచ్చితంగా మేలు జరుగుతుందన్నారు.
ప్రజల బాగోగుల కోసమే పార్లమెంట్ చట్టాలు చేస్తోంది. ఐతే, ఆర్టికల్370 కారణంగా ఆ చట్టాలు జమ్మకాశ్మీర్ కు చేరడం లేదు. అభివృద్ది జరగడం లేదు. 370రద్దుతో కశ్మీర్ లో అవినీతి అంతం కానుంది. ఆనాడు భారత్ లో విలీనమైన సంస్థానాలన్నీ ఈ రోజు భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ సంస్థానాలలో ఎక్కడా ఆర్టికల్ 370 అమలులో లేదు. ఒక్క కాశ్మీర్ లో మాత్రం ఎందుకు అన్నారు. అయినా ఒక తాత్కాలిక ఆర్టికల్ ను ఎంత కాలం కొనసాగిస్తారా..!? ఇన్నాళ్లు కశ్మీర్ లో మూడ్నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. తాజా 370రద్దుతో కశ్మీర్ లో అవినీతి అంతం కానుందన్నారు.