అలర్ట్ : 16నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్


పేదలు మెచ్చిన సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకం పుణ్యమా అని పేదలు కార్పోరేటు వైద్యం పొందుతున్నారు. ఐతే, ఈ నెల ఈనెల 16వతేదీ నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నారు. జేహెచ్ఎస్, ఈహెచ్ఎస్ సేవలనూ ప్రైవేట్ ఆస్పత్రులను నిలిపివేయనున్నాయి. సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈనెల 10వ తేదీ నుంచి ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. ఇందుకు గల కారణాలు ఏంటన్నది స్పష్టంగా తెలియరాలేదు.