యూవీ అదరగొట్టాడు.. కానీ !
రిటైర్డ్మెంట్ తర్వాత కూడా యువరాజ్ సింగ్ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో టొరంటో నేషనల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బ్రాంప్టన్ వూల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ అదరగొట్టాడు. కేవలం 22 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. 3 బౌండరీలు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు.
ఐతే, బ్రాంప్టన్ వూల్వ్స్ నిర్ధేశించిన 222 పరుగుల టార్గెట్ ని టొరంటో నేషనల్స్ చేధించలేకపోయింది. 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. యూవీకితోడుగా హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. వీరిద్దరూ 44 బంతుల్లో 75 పరుగులు జోడించారు. అయితే వెంటవెంటనే వీరిద్దరూ ఔట్ కావడంతో ఆ జట్టు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.