భువీ పెళ్లి ముచ్చట్లు

టీమిండియా యువ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ నెల 23న తన ప్రేయసి నుపుర్‌ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. “జట్టులో ఒకరైన భువనేశ్వర్‌ పెళ్లిచేసుకోబోతున్నాడు. భువి.. ఎలా ఫీలవుతున్నావు, ఎలా సిద్ధమవుతున్నావు ?? అని అడగ్గా.. భువి నవ్వుతూ సమాధానమిచ్చాడు. దీన్ని పోస్టు చేసిన ధావన్‌ ‘భువి విష్యూ వెరీ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌” అని పేర్కొన్నాడు. కాగా, ఈ యేడాది అక్టోబరు 4న భువి-నుపుర్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

పెళ్లి నేపథ్యంలో.. శ్రీలంకతో తదుపరి రెండు టెస్టులకు భువి దూరం కానున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా శ్రీలంక రెండో టెస్టుకు అందు బాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ధావన్ నాగ్‌పూర్‌లో జరిగే టెస్టుకు దూరమయ్యాడు. భువి స్థానంలో తమిళనాడు ఆటగాడు విజయ్‌ శంకర్‌ను తీసుకున్నారు.

Lo ji ban gya ek aur joru ka ghulam @imbhuvi ..🤣😌Wish you a very happy married life bro..🤗👍🏼

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on