కాంగ్రెస్’ని వ్యతిరేకించిన రాములమ్మ
జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేకాదు.. జమ్మకాశ్మీర్ ని పునర్విభజన చేశారు. అసెంబ్లీ కూడిన కేంద్ర ప్రాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్. లడఖ్ ని సపరేటు కేంద్రం పాలిత ప్రాంతంగా విభజించారు. అధికార బీజేపీ ప్రవేశపెట్టిన జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ బీజేపీ చర్యను రాజ్యాంగానికి తూట్లు పొడిచి.. కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛను హరించినట్లేనన్నారు. ఆ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా బిల్లుకు మద్దతు ఇవ్వడంతో పాటు గొప్ప చర్యగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ-నెహ్రూ కుటుంబం సన్నిహితుడు జనార్ధన ద్వివేది కూడా బిల్లును సమర్థించారు. ఆ బాటలోనే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా బిల్లుకు మద్దతు తెలిపారు. దేశ భద్రత దృష్ట్యా జ్యోతిరాదిత్య, జనార్ధన ద్వివేది కూడా సమర్థించినట్లు చెప్పుకొచ్చిన విజయశాంతి రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. జమ్మూకశ్మీర్ విభజనను మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారని, దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తమ గళాన్ని వినిపిస్తారన్నారు.