సెన్సార్ రివ్యూ : బాలకృష్ణుడు
విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొంటున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. ఆయన తాజా చిత్రం ‘బాలకృష్ణుడు’. పవన్ మల్లెల దర్శకుడు. రోహిత్ సరసన రెజీనా జతకట్టనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ‘బాలకృష్ణుడు’ ఈ నెల 24 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా, సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొన్నాడు.
సెన్సార్ బోర్డు బాలకృష్ణుడుకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని జారీ చేసింది. హైదరాబాద్ – కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ ప్రేమకథగా తెరకెక్కిన బాలకృష్ణుడు ఆకట్టుకొనేలా ఉన్నాడన్నది సెన్సార్ టాక్. 142 నిమిషాల నిడివితో సినిమాని షార్ప్ గా కట్ చేశారని చెప్పుకొంటున్నారు. ఇన్నాళ్లు బొద్దుగా కనిపించే నారా రోహిత్ స్లిమ్ గా మారడం, సినిమాలో రెజీనా హాట్ హాట్ గా కనిపించడం కొత్తగా అనిపిస్తాయని చెబుతున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. మహేంద్ర బాబు, వంశీ, వినోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.