‘సాహో’ : మరో ఫస్ట్ లుక్


బాహుబలి ప్రభాస్ సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 10 నుంచి వరుసగా అన్నీ బాషల్లో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు, సినిమాలోని పాత్రల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో విలన్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టయిలీష్ లుక్ లో సాహో విలన్ అరుణ్ విజయ్ అదరగొట్టేశాడు. తాజాగా మరో పాత్రని పరిచయం చేసింది సాహో చిత్రబృందం.

సినిమాలో కీలక పాత్ర దేవ్ రాజ్ (చుంకీ పాండే) ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. చేతితో చుట్టకాలుస్తూ.. గ్యాంగ్ స్టర్ లుక్ లో దేవ్ రాజ్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారు. ఇక సాహో నుంచి రోజుకో ఫస్ట్ లుక్ బయటికొచ్చేలా కనిపిస్తోంది. ఇలా ఈ నెల 10వరకు ఫస్ట్ లుక్ లని వదిలి.. ఆ తర్వాత ట్రైలర్ ని వదలనున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రభాస్ వరుసగా టీవీ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు. మొత్తానికి.. సాహో ప్రమోషన్స్ ని పీక్స్ తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అన్నట్టు సాహో గేమ్స్ కూడా రాబోతున్నాయ్.

‘సాహో’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. రన్ రాజా రన్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్లకిపైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది.