విజయ్’తో కైరా రొమాన్స్

కోలీవుడ్’కు వెళ్లాలంటే టాలీవుడ్ దగ్గర దారి. టాలీవుడ్ లో రాణించిన హీరోయిన్స్.. కోలీవుడ్ కు వెళ్లడం అక్కడ రాణించడం స్టార్ హీరోయిన్స్ గా ఎదగడం పరిపాటి. కోలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లోనూ హవా చూపిస్తుంటారు. త్రిష, నయనతార, కాజల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీని ఏలారు. బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఒకేసమయంలో తెలుగు, తమిళ చిత్రాల్లో రాణించారు.

‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అడ్వానీ తమిళ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు సమాచారమ్. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో కైరా రొమాన్స్ చేయనుందట. ‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్ లో కైరాకి డిమాండ్ పెరిగింది. ఆమె కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయినా.. ఆమె దక్షిణాది సినిమాలని మిస్ చేసుకోవడం లేదు. మరీ.. ముఖ్యంగా స్టార్ హీరోలతో అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పేస్తోంది. విజయ్ సినిమా ఆఫర్ రాగానే కథ ఏంటని అడగకుండానే ఓకే చెప్పేసిందట.