ఓవర్సీస్’లో ‘మన్మథుడు 2’ టికెట్ రేటెంతో తెలుసా ?


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అదించారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ శుక్రవారం (ఆగస్టు9) మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతకంటే ఓ రోజు ముందుగానే అంటే ఆగస్టు 8న యుఎస్ లో మన్మథుడు 2 విడుదల కానుంది. ఓవర్సీస్ లో 250+ ప్రాంతాల్లో మన్మథుడు 2 ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ రేటుని $12గా నిర్థారించారు. ప్రతి షోకి ఇదే రేటు ఉండనుంది. మరోవైపు, సినిమా ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లే పనిలో చిత్రబృందం ఉంది. సినిమా ఆధ్యాంతం వినోదాత్మకంగా ఉండనుందని ఇప్పటికే నాగ్ తెలిపారు. ఐదే నిజమైతే.. మన్మథుడు 2 థియేటర్స్ లో నవ్వులే నవ్వులే. ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులకి పండగే. ఎందుకంటే? రెండో మన్మథుడు రొమాంటిక్ మరీ.. !