ఆ హీరోకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇచ్చిన కేంద్ర మంత్రి.. !
కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ కామెంట్ చేశాడు. గోవాలో సోమవారం 48వ ‘అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీది తెరకెక్కించిన ‘బియాండ్ ది క్లౌడ్స్’ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా గురించి వ్యాఖ్యాతగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘అరె.. మజిద్ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయన కూడా ఇరానీనే’ అని చమత్కరించాడు. ఇందుకు కేంద్రమంత్రి సీరియస్ అవ్వకుండా అతనికి దీటుగా సమాధానమిచ్చారు. “ఓ మంత్రిపై హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తోందో. ధన్యవాదాలు రాజ్‌కుమార్. కనీసం నీ కామెంట్‌తోనైనా నీ కాలు విరగొట్టింది భాజపా కార్యకర్తలేనని ఎవ్వరూ మాపై నిందలు వేయకుండా ఉంటారు” అంటూ కౌంటర్ ఇచ్చింది.