కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ?
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భాజాపా ఆశపడుతోంది. ఇందుకోసం ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలని పార్టీలో చేర్చుకుంటోంది. ఇక తెలంగాణ కోసం భాజాపా జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగనున్నాడు. అమిత్ షా తెలంగాణ నుంచే పార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్నాడు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న భాజపా సెప్టెంబరు 17న నిజామాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకి అమిత్‌షా హాజరుకానునున్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అమిత్ షా బిగ్ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలని షా పరిశీలిస్తున్నారట.
కశ్మీర్ వ్యవహారంతో తెలంగాణలో భాజాపా పట్ల సానుకూలతపెరిగింది. కశ్మీర్, హైదారాబాద్ రెండు సంస్థానాలు ఒకేసారి భారతదేశంలో విలీనం అయ్యాయి. సైనిక చర్య ద్వారా హైదారాబాద్ ని భారతదేశంలో విలీనం చేశారు. ఐతే, ఎంఐఎంతో దోస్తానా కారణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు. ఇప్పుడిదే అస్త్రంగా భాజాపా.. తెరాసని ఇరుకున పెట్టాలని తద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !