గ్రేట్ : తొలి సినిమాతోనే జాతీయ అవార్డు

తెలుగు చిత్రాలకి జాతీయ అవార్డుల పంట పండింది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలు దక్కాయి. మహానటి, రంగస్థలం, చి.ల.సౌ, అ! చిత్రాలు జాతీయ అవార్డుల్ని గెలుచుకున్నాయి.
ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌ (మహానటి) జ్యూరీని మెప్పించింది. 28 ఏళ్ల తరవాత తెలుగు సినిమాలో నటించిన ఓ కథానాయికకు ఈ పురస్కారం దక్కడం విశేషం.

ఇక దర్శకుడుగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డులని అందుకొన్నారు దర్శకులు ప్రశాంత్ వర్మ, రాహుల్ రవీంద్రన్. ‘అ!’ అనే ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ మేకప్ ఆర్టిస్టు విభాగంలో ‘అ!’కు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో కన్నడ చిత్రం కేజీఎఫ్ కలిసి అ! అవార్డు పంచుకొంది.

“చి.ల.సౌ” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డుని గెలుచుకొంది. తొలి సినిమాతో దర్శకుడుగా పర్వాలేదనిపిస్తేనే చాలు అనుకొంటారు. ప్రశాంత్ వర్మ, రాహుల్ రవీంద్రన్ లు తొలి సినిమాతో కమర్షియల్ హిట్ తో పాటు ఏకంగా జాతీయ అవార్డులని అందుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఈ ఆణిముత్యాలాంటి దర్శకులకి కంగ్రాట్స్ చెబుతోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.