‘రాక్షసుడు’ తొలివారం.. సేఫ్ కాదు !
‘రాక్షసుడు’ తొలివారం విజయవంతంగా పూర్తి చేసుకొన్నాడు. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ఇది. బెల్లంకొండ సరసన అనపమ పరమేశ్వరన్ నటించింది. రాక్షసుడుని తెలుగు ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకొన్నారు. హిట్ టాక్’తో తొలివారమే రాక్షసుడు బ్రేక్ ఈవెన్ చేరుకొంటాడు అనుకొన్నారు. కానీ అలా జరగలేదు. 50-60% రికవరీ సాధించింది. కొన్నిచోట్ల అంతకన్నా ఎక్కువే సాధించింది.
రాక్షసుడు ఏరియాలవారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాం – 3.20 కోట్లు, సీడెడ్ – రూ. 1.10కోట్లు, ఉత్తరాంధ్ర – రూ. 1.12కోట్లు, ఈస్ట్ – రూ. 0.60కోట్లు, వెస్ట్ – రూ. 0.45కోట్లు, కృష్ణ – రూ. 0.60కోట్లు, గుంటూరు – రూ. 0.61 కోట్లు, నెల్లూరు – రూ. 0.25 కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు రూ. 9కోట్లు వరకు రాక్షసుడు రాబట్టాడు.
రెండోవారం పోటీలో మన్మథుడు 2, కథనం సినిమాలు ఉన్నాయి. వీటి నుంచి పోటీని ఎదుర్కొంటూ రాక్షసుడు ఎంత రాబడతాడు అనేది చూడాలి. వరుసగా నాలుగైదు రోజులు సెలవులు ఉండటం రాక్షసుడుకి కలిసొచ్చే విషయం. ఇక, రాక్షసుడు హిట్ టాక్ తో బెల్లకొండ ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. అది కాస్త ఎక్కువై.. ఇదే శ్రీనివాస్ మొదటి సినిమా అని ప్రచారం చేసుకొంటున్నారు కూడా. దీని కారణంగా వివి వినాయక్, బోయపాటి లాంటి మాస్ దర్శకులు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే. వాళ్లు బెల్లకొండకి హిట్ ఇవ్వాలని ట్రై చేశారు.