ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ప్రభాస్ సిక్సులు వర్షం!

“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో కొట్టినోడికే ఒక రేంజ్ ఉంటది” సాహో ట్రైలర్ లో పేలిన డైలాగ్ ఇది. అందుకు తగ్గట్టుగానే సాహో ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. యాక్షన్ అదిరిపోయింది. డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలాయ్. ఎమోషనల్ టచ్ ఉంది. ఇవన్నీంటిని మించి స్టయిలీష్ స్క్రీన్ ప్లే కనిపించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టేడియల్ లో సిక్స్ లు కన్ఫాం అంటున్నారు. సాహో ట్రైలర్ పై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరేమన్నారంటే.. ?

* రానా : సాహో..

సాయిధరమ్‌ తేజ్‌ : చాలా సమయం తీసుకున్నా.. ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వపడేలా చేశారు డార్లింగ్స్‌. ప్రభాస్‌ అన్న సిక్సర్‌ కచ్చితంగా మైదానం దాటేస్తుంది.

* శోభూ యార్లగడ్డ : సూపర్‌.. సినిమాను చూడాలని చాలా ఆతృతగా ఉంది

* బ్రహ్మాజీ : హాలీవుడ్‌ సినిమానా.. తెలుగు సినిమానా.. ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సిక్స్‌లు కన్ఫాం. ప్రభాస్‌ అద్భుతం.. ఈ కుర్ర డైరెక్టర్‌ సూపర్‌.. మీకు శుభాకాంక్షలు.

* సందీప్‌ కిషన్‌ : అద్భుతం.. ఇంత గొప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సుజీత్‌ సూపర్‌.. ప్రభాస్‌ కేక..

* సునీల్‌ : ‘సాహో’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా చూడాలని ఆతృతగా ఉంది. నా సోదరుడు ప్రభాస్‌కు ఆల్‌ ది బెస్ట్‌.

* రాహుల్‌ రవీంద్రన్‌ : వావ్‌.. అద్భుతమైన విజువల్స్‌. సినిమా కోసం ఎదురుచూస్తున్నా.

* గోపీ మోహన్‌ : సూపర్‌ ట్రైలర్‌.. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రేమికుల్లో ఆతృత పెంచింది. ఆగస్టు 30 కోసం ఎదురుచూస్తున్నా.

* నితిన్‌ : టాప్‌ క్లాస్‌, మైండ్‌ బ్లోయింగ్‌.. ‘సాహో’ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్. చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నా.

* బాబీ : ‘సాహో’ ట్రైలర్‌ చూసేందుకు అద్భుతంగా ఉంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాను బిగ్‌ స్క్రీన్‌లో చూడాలని ఆతృతగా ఉంది. ప్రభాస్‌కు ఆల్‌ ది బెస్ట్‌.

* హరీష్‌ శంకర్‌ : తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించాల్సిన సమయం ఇది. ‘సాహో’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కుడోస్‌.