తమన్నాని తరిమేశారు.. !


ఊహించిందే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయింది అనడం కంటే తమన్నాని తరిమేశారు అనడమే కరెక్ట్. హౌస్ లో ఆమె ప్రవర్తన చిరాకు తెప్పించేలా ఉంది. పర్సనల్ గా ఎటాక్ చేస్తూ.. బూతులు మాట్లాడుతూ రచ్చ చేసింది. రవికృష్ణ అసలు మగాడే కాదంటూ.. పప్ప పప్పు అంటూ దిగజారే మాటలు మాట్లాడింది. శివ జ్యోతి విషయంలో జర్నలిస్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో ఈవారం తమన్నాని తరిమేయడం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడదే జరిగింది. హౌస్ సభ్యులు కూడా ఈవారం తమన్నా ఎలిమినేట్ అవుతుందని ముందే చెప్పారు. ఇక, వితికా వరసగా రెండు వారాలు చివరి నిమిషంలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్నారు. ఆదివారంనాటి షోకి కమెడియన్ వెన్నెల కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై కితకితలు పెట్టారు.