సినిమా హబ్’గా తెలంగాణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు కనబడుతోంది. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ది కోసం త్వరలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని హామి ఇచ్చారు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రముఖ కె.విశ్వనాథ్‌ ని కలిశారు. ఈ సందర్భంగా చలన చిత్రాల నిర్మాణంలో ముంబయిని మించిపోయేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

“హైదరాబాద్‌కు ఎన్నో ఆకర్షణలున్నాయి. అన్ని విధాలా అనుకూలమైన చక్కటి వాతావరణం ఉంది. చిత్రీకరణకు అనువైన ప్రాంతాలు, వనరులున్నాయి. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి అనుకూలతలను ప్రశంసించారు. దేశంలో అత్యధిక చిత్రాల నిర్మాణం ఇక్కడే జరగాలి. చలనచిత్ర రంగం తెలంగాణ అభివృద్ధిలో ప్రధాన పోషించాలి. దీనికి ఏమేం చేయాలో అది చేస్తాం. చలనచిత్ర రంగం అవసరాలు, ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకొని కొత్త విధానం తేవాలన్నదే మా ఆకాంక్ష”అన్నారు కేసీఆర్.