మన్మథుడుపై సమంత మౌనం.. ఎందుకు ?


నాగ చైతన్య సినిమా వస్తుందంటే.. ఆగలేకపోతున్నాని ట్విట్ చేస్తుంటుంది సమంత. ఆమె సొంత సినిమా గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. కానీ, మామ నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రాన్ని సామ్ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు రెండో మన్మథుడు గురించి సామ్ నోరు తెరవలేదు. ట్విట్ చేయలేదు. పైగా ఇందులో సామ్ గెస్ట్ రోల్ లో మెరిసింది. రిలీజ్ ముందు వరకు సామ్ పాత్రని సీక్రెట్ గా ఉంచారు.

పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో సామ్ కనిపించింది. అవసరం లేని గెస్ట్ పాత్రలో సామ్ ని చూపించాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ విషయం పక్కనపెడితే.. ఇంతకీ సామ్ మన్మథుడు 2 ని ఎందుకు అవైడ్ చేసినట్టు ? మామపై కోపమా ? లేక రెండో మన్మథుడు సామ్ కి అసలు నచ్చలేదా.. ?? తెలియాల్సి ఉంది. ఇలాంటి చిన్ని విషయాలే భయంకరమైన గాసిప్ లకి తావినిస్తాయి. మామ-కోడళ్లకి చెడింది ? మామని పట్టించుకోని కోడలు ?? లాంటి లైన్స్ బయటికొస్తాయి. ఇలాంటివి గాసిప్ లు రావొద్దనుకొంటే రెండో మన్మథుడుపై సామ్ ఇప్పటికైనా స్పందిస్తే మంచిదేమో.