బన్నీ-త్రివిక్రమ్ సినిమా టైటిల్ లీక్.. !


‘త్రివిక్రమ్-బన్నీ’లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోంది. జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే యేడాది సంక్రాంతికానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన కథ. ‘నాన్న-నేను’ అనుకొంటున్నారు అనే ప్రచారం జరిగింది. ‘అలకనంద’ అంటూ మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఐతే, ఆగస్టు 15న సినిమా టైటిల్ ని ప్రకటిస్తామని సోమవారమే చిత్రబృందం ప్రకటించింది. ఇంతలోనే సినిమా టైటిల్ లీకైంది. ఈ సినిమా కోసం అచ్చ తెలుగు టైటిల్ ‘వెంకటాపురంలో’ ఫిక్స్ చేసినట్టు సమాచారమ్.

‘వెంకటాపురంలో’ ఏం జరిగింది అనేది సినిమాలో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియిర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతాఆర్ట్స్, హారిక & హాసిని బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.