అందుకే అనసూయని తగులుకొన్నారట.. !
హాట్ యాంకర్ అనసూయ మంచి నటి అనిపించుకొంది. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి నటి అనిపించుకొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. యావరేజ్ సినిమా అనిపించుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనసూయ ఆసక్తికర విషయాలు పంచుకొంది. ఈ మధ్య అనసూయ డ్రెస్సింగ్ పై ట్రోల్ జరిగిన సంగతి తెలిసిందే. ఆమె తొడలు కనిపించేలా, హాటుగా ఉన్న ఫోటోలని షేర్ చేసింది. వాటిపై నెటిజన్స్ మండిపడ్డారు.
ఈ విషయంపై అనసూయని ప్రశ్నిస్తే.. ‘నేను ఇద్దరు పిల్లలకు తల్లి కావడం, తెలుగు అమ్మాయిని కావడం వలనే నా దుస్తుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని’ చెప్పుకొచ్చింది. అదే వేరే అమ్మాయి అయితే ఇలా ట్రోల్ చేసేవారా.. ? అసలు పట్టించుకోరు కదా.. అంది. ఐతే, ఈ ట్రోలింగ్ లో తన పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయడం బాధకలిగిస్తోందని చెప్పుకొచ్చింది.
‘నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు..?’ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారని.. నా పిల్లలకు ‘అర్జున్ రెడ్డి’ స్టైల్ లో పెంచుతా.
ఒక అమ్మాయి ఎవరైతే నీ కోసం పుట్టిందో, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరు నీ ముందు నగ్నంగా నిలబడ్డా నువ్వు ఆ రకంగా చూడొద్దు అనే విధంగా నా పిల్లలను పెంచుతానంది అనసూయ. అన్నట్టు.. అర్జున్ రెడ్డి సినిమాని తీవ్ర స్థాయిలో విమర్శించిన వారిలో అనసూయ ఒకరు. ఇప్పుడేమో.. తన పిల్లలని అర్జున్ రెడ్డి మాదిరిగా పెంచుతానంటోంది. అప్పుడు నచ్చని అర్జున్ రెడ్డి ఇప్పటికీ నచ్చాడేమో.. !