‘వాల్మీకి’ టీజర్.. ముహూర్తం ఫిక్స్ !


హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ్ హిట్ ‘జిగర్తాండ’కి రిమేక్ ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక, ఈ సినిమా టీజర్ ని ఆగస్టు 15 కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది.

ఇందులో వరుణ్ తేజ్ భయంకరమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఉంగరాల జుట్టు, పెద్ద మీసాలు, గుబురు గడ్డంతో రగ్డ్ లుక్ తో ఉన్నాడు. నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో వరుణ్ లుక్ ఫర్ ఫెక్ట్ గా సూటైనట్టు కనిపిస్తోంది. వరుణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తోంది.