‘సైరా’ మేకింగ్ వీడియో చూస్తారా.. ?


మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 2 సైరా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమా నుంచి పంద్రాగస్ట్ కానుకగా మేకింగ్ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రేపు (ఆగస్ట్14) సాయంత్రం 3:45నిమిషాలకి సైరా మేకింగ్ వీడియోని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్ చేసింది. దాంతోపాటు.. ఇండియన్ ట్రెండింగ్ నెం.1లో #SyeRaaNarasimhaReddy యాష్ టాగ్ ఉండటాన్ని స్క్రీన్ షాట్ తీసిన పిక్ ని పోస్ట్ చేశారు. మేకింగ్ వీడియోతోనే సరిపెడతారా..? ఆగస్టు15న సైరా నుంచి బోనస్ గిఫ్ట్ కూడా రానుందా ? అన్నది తెలియాల్సి ఉంది.