నాగశౌర్యకు ఫైన్ పడింది
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఫైన్ పడింది. ఆయన ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో బ్లాక్ ఫిల్మ్ కారులో నాగశౌర్య ప్రయాణిస్తుండగా గమనించిన పోలీసులు.. ఆ వాహనాన్ని ఆపి రూ.500 జరిమానా విధించారు. బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి అనంతరం నాగశౌర్య వాహనాన్ని పంపించారు. ఇలా బ్లాక్ ఫిల్మ్ కారులో ప్రయాణించిన చాలా మంది సినీస్టార్స్ కి గతంలో ఫైన్ పడన సంగతి తెలిసిందే.
ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగశౌర్య సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రానికి “అశ్వద్ధామ” పరిశీలనలో ఉంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లోనే నాగశౌర్య గాయపడ్డారు. ఇప్పుడు కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో 3 నిమిషాల యాక్షన్ సన్నివేశం ఒకటి ఉండబోతోంది. దీన్ని సింగిల్ టేక్ లో తీశారట. అది సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది.