33 ఇయర్స్ విక్టరీ.. !


విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకొన్న కథానాయకుడు వెంకటేష్. ‘కలియుగ పాండవులు’ నుంచి ‘ఎఫ్ 2’ వరకు వెంకీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడుతూ విజయాలు అందుకొంటున్నారు. యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. అంతకుమించి ఇండస్ట్రీలో అందరివాడిలా గుర్తింపు తెచ్చుకొన్నాడు. వెంకీ అందరి హీరో. అందరు మెచ్చే హీరో. ప్రతి హీరో అభిమానికి వెంకీ కామన్ ఫేవరేట్. ఆయన తీరు, పద్దతి, మర్యాద అలాంటిది.

వెంకీ హీరోగా పరిచయమై నేటితో 33యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా #33YearsForVenkyMamaInTFI CDPని విడుదల చేశారు. వెంకీ నటించిన సినిమా పోస్టర్స్ తో CDPని ఆకట్టుకొనేలా డిజైన్ చేశారు. ఇక, ప్రస్తుతం వెంకీమామ సినిమాతో బిజీగా ఉన్నారు వెంకీ. ఇందులో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది.