లీకైన టైటిల్ నే ప్రకటిస్తారా.. ?


త్రివిక్రమ్ దర్శకత్వంలో #AA19 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఆగస్టు15 కానుకగా ప్రకటించనున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ విడుదలకి సంబంధించిన ముహూర్తపు పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. రేపు ఉదయం 11:07నిమిషాలకి టైటిల్ పోస్టర్ ని విడుదల ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఇక, ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ లో ప్రచారంలోకి వచ్చాయి. నాన్న నేను, అలకనంద టైటిల్స్ చాన్నాళ్ల నుంచి వినబడుతోంది. నిన్నటి నుంచి ‘వెంకటాపురంలో’ అనే కొత్త టైటిల్ వినిపిస్తోంది.

దాదాపు ‘వెంకటాపురంలో’ ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ ఈ లీకైన టైటిల్ నే చిత్రబృందం ప్రకటిస్తుందా.. ? లేదంటే ప్రేక్షకులని సప్రైజ్ చేస్తూ కొత్త టైటిల్ ని పెడతారా ?? అన్నది చూడాలి. ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ లకి మంచి పాత్రలు దక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హారిక బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయనున్నారు.