సంచలనం : మహిళా క్రికెటర్ నగ్నంగా వికెట్ కీపింగ్

నగ్నంగా వికెట్ కీపింగ్ చేసి సంచలనం సృష్టించింది ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ సారా టేలర్. దానికి సంబంధించిన నగ్న ఫోటోలని తన ఇన్ స్ట్రోగ్రామ్ పోస్ట్ చేసింది టేలర్. ఐతే, ఇదంతా మహిళా సాధికారత కోసమే చేశానని టేలర్ చెప్పడంతో ఆమె పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు.. మహిళాసాధికారత గురించి టేలర్ గొప్పగా రాసుకొచ్చింది.

“నేను కంపర్ట్ జోన్ నుండి కొద్దిగా బయటకు వచ్చాను. నా గురించి తెలిసిన వారికి ఈ విషయం అర్థమైవుంటుంది. ఐతే, ఉమెన్స్ హెల్త్ హక్ వారు నన్ను మహిళా సాధికారత కోసం ఏదైనా చేయాలని ఆహ్వానించినపుడు చాలా గర్వంగా అనిపించింది. శారీరకంగా గతంలో నేను కూడా ఎన్నో సమస్యలతో బాధపడ్డాను. ఐతే, అందులో కొన్నింటి నుండి నేను బయటపడగలిగాను. కాబట్టి ప్రతి మహిళా తన శారీరక సమస్యలపై అవగాహన కలిగివుండాలి. కానీ చాలా మంది సిగ్గు, బిడియం తదితర కారణాలతో ఆ పని చేయలేరు. అలాంటి వారిలో మార్పు కోసమే తాను ఈ ఫోటోను మీతో పంచుకున్నాను. ఎవరో ఏదో అనుకుంటారన్న భయంతో మనలోని సమస్యను దాచిపెట్టి బాధపడటం మానండి. ప్రతి ఒక్క మహిళా తన శారీరక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడగలగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. చివరగా ప్రతి అమ్మాయికి ఎదుటివారే తనకంటే అందంగా వున్నారని అనిపిస్తుంది. కానీ తనతో పాటు ప్రతీ మహిళా అందమైనవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ‘ అని టేలర్ రాసుకొచ్చింది.