రివ్యూ : ఎవరు


చిత్రం : ఎవరు (2019)

నటీనటులు : అడవిశేష్, రెజీనా, నవీన్ చంద్ర తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల

నిర్మాత : పివిపి

రిలీజ్ డేటు : 15 ఆగస్ట్, 2019.

రేటింగ్ : 3/5

అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఎవరు’. వెంకట్‌ రాంజీ దర్శకుడు. పీవీపీ సినిమాస్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. Invisible Guest (2016) అనే థ్రిల్లర్ కు రైట్స్ తీసుకుని కొద్ది పాటి మార్పులతో రీమేక్ చేసేసారు. ఈ సినిమా అంతకు ముందే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను కాంబినేషన్లో ‘బద్లా’ గా రీమేక్ అయ్యి వచ్చి హిట్టైంది. ఇప్పుడు తెలుగులో ‘ఎవరు’గా తీసుకొచ్చాడు. ఆగస్టు 15 కానుకగా ‘ఎవరు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘ఎవరు’ ఏ మేరకు ప్రేక్షకులని థ్రిల్ చేసింది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

సమీర (రెజీనా) ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. తనపై రేప్ అటెమ్ట్ వల్లే ఆ హత్య చేయాల్సి వచ్చిందనేది సమీర వాదన. ఐతే, హత్య చేయబడ్డ అశోక్ (నవీన్ చంద్ర) డీఎస్పీ కావడంతో.. ఆ కేసుని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుని ఓ పేరున్న లాయర్ కి అప్పజెపుతుంది. బెయిల్ పై విడుదలైన సమీర తన లాయర్ బెనర్జీ సాయంతో తనకి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు తెలుసుకునేందుకు లంచగొండి ఎస్సై విక్రమ్ సహదేవ్ (అడివి శేష్) సాయం తీసుకుంటుంది. ఈ కేసులు అసలు నిజాలు తెలిస్తేనే నెక్ట్స్ స్టెప్ వేయొచ్చని విక్రమ్ అంటాడు. ఇంతకీ.. సమీర చెప్పిన ఆ నిజాలేంటీ ? అశోక్ హత్యకి కారణాలేంటీ ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

* శేష్, రెజీనాల నటన

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

క్రైమ్‌ థ్రిల్లర్‌ గొప్పతనం అంతా స్క్రీన్ ప్లే లోనే కనబడుతోంది. Invisible Guest (2016)లోనూ దాని హిందీ రిమేక్ ‘బద్లా’లోనూ స్క్రీన్ ప్లే అద్భుతంగా కుదిరింది. ఒక్కో సీన్ ని పేకమేడలా పేర్చుకొంటూ.. ప్రేక్షకుడిని ఉత్కంఠకి గురిచేస్తూ సినిమా ముందుకు తీసుకెళ్లడం.. ఆ తర్వాత ట్విస్టులతో అసలు కథని రిలీవ్ చేసి.. ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేయడం థ్రిల్లర్ కథల ప్రత్యేకత.

‘ఎవరు’లోనూ ఆ మేజిక్ వర్కవుట్ అయింది. Invisible Guest స్క్రిప్ట్ లో పెద్దగా మార్పులు చేశారు. చేసిన ఒకట్రెండు మార్పులని గొప్పగా చూపించారు. దీంతో కథ చెడిపోలేదు. కథనం కొన్ని చోట్ల స్లోగా సాగినా.. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో దాన్ని మరచిపోవచ్చు. కథ మొత్తం రెజీనా, అడవిశేష్ ల చుట్టూనే తిరుగుతుంటుంది. వీరు తమ పాత్రలో ఒదిగిపోయారు. రెజీనా నటనతో, గ్లామర్ తోనూ ఆకట్టుకొంది. ఇదివరకు ఎప్పుడు కనిపించినంత హాటుగా కనిపించింది. ఇక, అడవిశేష్ నటన సినిమాకే హైలైట్.

సాంకేతికంగా :

క్షణం, గూఢచారి టెక్నికల్ గా హై లెవల్ లో అనిపించాయి. ఆ స్థాయిలోనే ‘ఎవరు’ కూడా ఉంది. సీన్స్ వెనక మనకు తెలియని ఏదో మిస్టరీ ఉందనించేలా బ్యాగ్రౌండ్ స్కోర్‌ని డిజైన్ చేసారు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమా విడుదలకి ముందే చాలామందికి చూపించారు. వారి అభిప్రాయాలని తీసుకొన్నారు. చిన్ని చిన్న మార్పులు చేశారు. అది కలిసొచ్చింది. ప్రేక్షకుడు ఎక్కడ బోర్ గా ఫీలవుతున్నాడు. ఎక్కడ మైనస్ అనిపించింది అవన్నీ చిత్రబృందానికి ముందే తెలిసిపోయింది. ఇక, పివిపి నిర్మాత విలువలు బాగున్నాయి.

చివరగా : క్రైమ్ థ్రిల్లర్ కొలతలతోనే ‘ఎవరు’ తెరకెక్కింది. ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలన్నీ ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాలని ఇష్టప్డే ప్రేక్షకులకి ఎవరు మంచి ఆప్షన్.

రేటింగ్ : 3/5