చరణ్ నుండి మళ్లీ తప్పించుకొన్న కొరటాల ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి దర్శకుడు కొరటాల శివ మరోసారి తప్పించుకొన్నట్టు సమాచారమ్. గతంలో వీరి కలయికలో ఓ సినిమా కోసం ప్రయత్నాలు జరిగాయి. సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే, అది సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. అందుకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే దర్శకుడు కొరటాలతో సినిమా ఉంటుందని చరణ్ ప్రకటన చేశాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం1985’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ కొరటాల సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడని చెప్పుకొన్నారు. అయితే, ఇప్పుడు సడెన్’గా బోయపాటి సినిమా లైన్ లోకి వచ్చేసిందని చెబుతున్నారు. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ బోయపాటి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారమ్. ఇప్పటికే బోయపాటి ప్రీ-ప్రొడక్షన్ పనులని కూడా మొదలెట్టాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. బోయపాటి సినిమా తర్వాతనైనా కొరటాల దర్శకత్వంలో చరణ్ సినిమా ఉంటుందా ? లేదంటే.. మరోసారి చరణ్ నుంచి కొరటాల తప్పించుకొన్నట్టేనా ? అనే గుసగుసలు వినబడుతున్నాయి.