‘గ్యాంగ్ లీడర్’ రెండో సాంగ్.. అదిరిపోయింది !

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’గా మారిన సంగతి తెలిసిందే. మెగా యంగ్ హీరోల్లో ఎవ్వరికీ దక్కిని అదృష్టం నానికి దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’గా మారాలని పవన్ కల్యాణ్, బన్నీ, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఆశపడ్డారు. కానీ, ఆ అవకాశం నానికి దక్కింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. సెప్టెంబరు 13న నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్యాంగ్ లీడర్ రెండో పాటను విడుదల చేశారు. ‘ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను ఇన్నో జెంగ్‌ ఆలపించారు. గ్యాంగ్ లీడర్ రెండో పాటని మీరు వినేయండీ.