నెం.4 దొరికేశాడు.. !

టీమిండియాలో నెం.4 ఎవరు ? వరల్డ్ కప్ ముందు, తర్వాత కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్థానానికి సరైన బ్యాట్స్‌మన్‌ మాత్రం దొరకట్లేదు. నం.4లో పంత్‌ మెప్పిస్తాడని భావించారు. కానీ, పంత్ పరిణతి కనిపించడంలో అనవసరమైన షాట్స్ లో అవుట్ అవుతున్నాడు. అదే సమయంలో ఐదో స్థానంలో వస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ వెస్టిండీస్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడడంతో నాలుగో స్థానానికి అతడే సరైన బ్యాట్స్‌మన్‌ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో నెం.4 దొరికేశాడు. శ్రేయస్ అయ్యార్ నెం.4కు సెట్టవుతాడని చెబుతున్నారు. కెప్టెన్ కోహ్లీ కూడా ఇదే మాట చెబుతున్నాడు. అతడు ఇలాగే బాధ్యతాయుతంగా ఆడితే భారత మిడిల్‌ ఆర్డర్‌లో సుస్థిర స్థానం దక్కించుకుంటాడు. శ్రేయస్ ఏమీ భయపెట్టేలా ఆడడు. కానీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. సాధికారికంగా ఆడతాడు. ఏ దశలోనూ అతడు ఔటయ్యేలా కనపడలేదు. చాలా సంతోషంగా ఉంది అన్నాడు కోహ్లి. శ్రేయస్ నెం.4 అయితే.. పంత్ నెం. 5గా నైనా సెట్టయితే మంచిదేమో.. !