ఢిల్లీ ఎయిమ్స్’లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మొదటి అంతస్తులోని అత్యవసర విభాగం సమీపంలో మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. షార్ట్ షార్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 40 ఫైర్ ఇంజన్స్ లో మంటలని ఆర్పుతున్నారు. మొత్తం పొగ కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరంగా మారింది.
ఇదే హాస్పటల్ లో భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు హాస్పటల్ వచ్చి జైట్లీని పరామర్శిస్తున్నారు. ఈ రోజు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ తదితరులు ఢిలీ ఎయిమ్స్ కి వచ్చి జైట్లీ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొన్నారు. జైట్లీ చికిత్స పొందుతున్న భవనానికి అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.