తెరాసలోకి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ?
కోమట్ రెడ్డి బ్రదర్స్ తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించాలని ఆశపడ్డారు. పీసీసీ పోస్ట్ ని కొట్టేయాలని చాన్నాళ్లు ప్రయత్నాలు చేశారు. ఐతే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారుతుండటంతో పార్టీ మారే ఆలోచన చేశారు. బ్రదర్స్ ఇద్దరూ కలిసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ ఒక్కరే కమలం గూటికి చేరేలా కనిపిస్తోంది. మరీ.. ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి ఏంటీ ? ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా ? అంటే.. ఆయన పక్క చూపులు చూస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ, కమలం వైపు కాదు. కారు వైపు.
శనివారం యాదాద్రి పర్యటనకి వచ్చిన సీఎం కేసీఆర్ తో వెంకట్ రెడ్డి బేటీ అయ్యారు. ఆలేరు నియోజకవర్గ తాగునీరు, సాగునీరు సమస్యలపై సీఎం చర్చించినట్లుగా వెంకట్ రెడ్డి చెప్పారు. కానీ, లోపలు పార్టీ మార్పుపై సీరియస్ గా చర్చలు జరిగినట్టు సమాచారమ్. గతంలోనే కోమట్ రెడ్డి బ్రదర్స్ తెరాస వైపు చూశారు. కానీ, పీసీసీ పదవి రాబోతుందనే ఆశతో కాంగ్రెస్ లోనే కొనసాగారు. లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామల నేపథ్యంలో కోమట్ రెడ్డి బ్రదర్స్ ని భాజాపా ఆకట్టుకొంది. కానీ బ్రదర్స్ సింగిల్ గా ఒకరు భాజాపాలో, మరొకరు తెరాసలో చేరాలని డిసైడ్ అయినట్టు లెటెస్ట్ టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.