బన్నీ ఐటమ్ రెడీ


మెగా హీరోలు అంటేనే మాస్ కి పెట్టింది పేరు. ఫైట్లు, డ్యాన్సుల్లో ఇరగదీస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో బన్నీ, రామ్ చరణ్ మెగా అభిమానులని ఆకట్టుకొన్నారు. ఇక, ఐటమ్ సాంగ్ లలో అదరగొట్టడం బన్నీకి వెన్నెతో పెట్టిన విద్య. ఆయన ప్రతి సినిమాల్లో ఓ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకొంటారు. బన్నీ-దేవిశ్రీ కలయికలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి.

ఐతే, ఈసారి బన్నీ కోసం థమన్ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి రెడీ చేసినట్టు సమాచారమ్. త్రివిక్రమ్-బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థమన్ ట్యూన్స్ అన్నీ ఇచ్చేశారు. ఇందులో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. వచ్చే షెడ్యూల్ లో ఈ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోనున్నారట.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది.