‘సాహో’ సెలబ్రేషన్స్ చూశారా ?


హైదరాబాద్ లో ‘సాహో’ పండగ జరుగుతోంది. రామోజీఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వేడుక ప్రారంభానికి ముందు చిత్రబృందం అదిరిపోయే పోస్టర్ ఒకటి రిలీజ్ వేశారు. ప్రభాస్ ఒళ్లో శ్రద్దాకపూర్ కూర్చొన్న రొమాంటిక్ పిక్ ఇది. మరోవైపు సాహో ప్రీ-రిలీజ్ వేడుకని పండగలా జరుపుకొంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఇప్పటికే అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. అరుపులు, కేకలతో హోరెత్తిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని మీ కోసం అందిస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కింది. ప్రభాస్ కి జంటగా శ్రద్దా కపూర్ నటించింది. ఈ సినిమా కోసం రూ. 350కోట్లు ఖర్చు చేశారు. ఈ నెల 30 సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.