పాక్ ప్రధానిని బికారి చేశారు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బికారి కాదు.. కాదు.. చేశారు. గూగుల్ సెర్చ్‌లో ‘bhikari’ (బిచ్చగాడు) అని ఎంటర్ చేసి ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే రిజల్ట్‌లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు వస్తున్నాయి. గూగుల్ అల్గారిథమ్‌లో కొన్ని కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. గతంలో ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫొటో చూపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ట్రంప్ ఇడియట్ కావడం చర్చనీయాంశం అయింది. దీనిపై ట్రంప్ అభిమానులు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని ప్రశ్నించారు.
ఇదే తరహా ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దొరికిపోయాడు. దీంతో ఆయన్ని ఓ ఆటాడుకొంటున్నారు నెటిజన్లు. ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లతో హోరెత్తిస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లని ట్విటర్‌లో పెట్టి తమదైన శైలిలో ఆడుకుంటున్నారు నెటిజన్లు. అలా ఎందుకు చూపిస్తోందో గూగుల్‌కే ఎరుక అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే.. తన వంతుగా డేటా రీఛార్జి చేసి పెడతానంటూ కామెంట్ చేస్తున్నారు. #bhikari ఇమ్రాన్ ఖాన్ బాగా సూట్ అయ్యాడు.