‘చూసీ చూడంగానే’ ఫస్ట్ లుక్ నచ్చేసింది !


‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధురావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరో శివ కందుకూరి మ్యారేజ్ ఫొటోగ్రాఫర్ కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో గస్ట్ 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా చూసి చూడంగానే నచ్చేసేలా ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేటుని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ‘చూసీ చూడంగానే’ పెళ్లి చూపులు రేంజ్ హిట్టవుతుందేమో చూడాలి.