వావ్.. మెగా మూమెంట్ అదిరింది !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య సతీమణి ఉపాసనని మెగా అభిమానులు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే.. మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్’కు సంబంధించిన విశేషాలని ఆమె తరచూ మెగా అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. అవి చూసుకొని మెగా అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా, ఓ మెగా మూమెంట్ ని అభిమానులతో పంచుకొంది ఉపాసన.

మెగా పవర్ స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి సరదాగా కూర్చొన్న ఫోటోని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇద్దరు కూడా గెడ్డం లుక్ లో కనిపిస్తున్నారు. మెగాస్టార్ ‘సైరా నర్సింహారెడ్డి’ కోసం గెడ్డం పెంచితే.. చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో గెడ్డం లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫోటో మెగా అబిమానులని అలరిస్తోంది. మీరు కూడా ఈ మూమెంట్ పై ఓ లుక్కేయండీ.. !