అనుష్క బికినీ పిక్’పై కోహ్లీ సీరియస్ కామెంట్ !
టీమిండియా విదేశీ టూర్ లు కోహ్లీ-అనుష్క దంపతులకి విహార యాత్రలుగా మారుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా వెస్టీండీస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐతే, ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకొన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్ లో విహారిస్తున్నారు. ఈ సందర్భంగా బికినీ తీసుకొన్న ఫోటోని అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘సూర్యుడు ముద్దు పెట్టుకొని.. ఆశీర్వదించాడు” అనే ట్యాగ్ లైన్ జతచేసింది.
ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య బికినీ ఫోటోపై కోహ్లీ స్పందించారు. ‘హృదయం, లవ్ స్ట్రక్ ఎమోజీల’ తో కూడిన కామెంట్ చేశాడు. ఇక, ఆగస్టు 18తో కోహ్లీకి 11యేళ్లు నిండాయి. 2008 ఆగస్టు 18న కోహ్లీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. తన 11యేళ్ల కెరీర్ పై కోహ్లీ స్పెషల్ ట్విట్ చేశారు. ‘దేవుడి దీవెనలు నాపై ఉంటాయని ఊహించలేదు. మీ కలలు నిజం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మీకు సరైన శక్తి, సామర్థ్యాలు లభిస్తాయి’ అంటూ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాటి ఫోటోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Sun kissed & blessed 🧡⛱️ pic.twitter.com/mDnMeGnF4L
— Anushka Sharma (@AnushkaSharma) August 19, 2019