మెగాస్టార్’కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

రెండ్రోజుల ముందే మెగాస్టార్ చిరంజీవికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు మెగా హీరోలు. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు. ఈ సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఈ వేడుకలకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక, అభిమానులకి రెండ్రోజుల ముందే చిరు బర్త్ డే గిఫ్ట్ ని అందజేయనున్నారు. రేపు (ఆగస్టు20)న సైరా టీజర్ ని విడుదల చేయబోతున్నారు. టీజర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అంతకంటే ముందే మెగా యంగ్ హీరోలు మెగాస్టార్ కి గిఫ్ట్ అందజేశారు. చిరంజీవి కామన్ డీపీని రిలీజ్ చేశారు. దీన్ని సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. మెగా యంగ్ హీరోలందరూ చిరు డీపీని షేర్ చేశారు. అంతేకాదు.. ప్రొపైల్ పిక్ గా పెట్టుకొన్నారు. ఇక పోస్టర్ లో చిరు లుక్స్ అదిరిపోయాయ్. పోస్టర్ లో పేదలకి అన్నదానం చేయాల్సిందిగా సూచించారు. మరోవైపు ఇప్పటికే మెగాస్టార్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొనేందుకు అభిమానులు రెడీ అయ్యారు.

మెగాస్టార్ సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. దాదాపు రూ. 250కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మించారు.