హీరో తరుణ్ కి తప్పిన ప్రమాదం


టాలీవుడ్ హీరో తరుణ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్ నర్సింగ్ సమీపంలో అల్కాపురం వద్ద తరుణ్ కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత తరుణ్ వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన తరుణ్.. ఆ తర్వాత హీరోగా మారి విజయాలు అందుకొన్నాడు. నువ్వేకావాలి, నువ్వే నువ్వే సినిమాలు తరుణ్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. లవ్వర్ బోయ్ ఓ వెలుగు వెళ్లాడు. ఐతే, ఆ తర్వాత వరుస ప్లాపులతో హీరోగా కొనసాగలేకపోయాడు. తరుణ్ నటించిన ఆఖరి చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఇప్పుడు తరుణ్ చేతిలో ఒక్క సినిమా కూడ లేదు. సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి తనయుడే తరుణ్. త్వరలోనే తరుణ్ కి పెళ్లి చేయబోతున్నట్టు ఇటీవలే రమణి తెలిపిన సంగతి తెలిసిందే.