ఏటీఎం కార్డులకి కాలం చెల్లనుందా ?
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టెలిగ్రామ్ ఆ తర్వాత కాలంలో కనుమరుగైంది. ఈమెయిల్ వచ్చి పోస్ట్ కార్డులని తొక్కేసింది. ఇక రాబోఒయే కాలంలో ఏటీఎం కార్డులకి కాలం చెల్లనుంది. ఈ మేరకు ఎఎస్ బీఐ కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. బిట్, క్రెడిట్ కార్డులు తొలగించి, మరిన్ని డిజిటల్ చెల్లింపు విధానాలను అమల్లోకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్టు రజనీశ్ తెలిపారు.
ఎస్బీఐ ఖాతాదార్లలో అత్యధికులు డెబిట్కార్డులపై ఆధారపడి ఉన్న సంగతి విదితమే. అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్ కార్డులను తొలగించాలన్నది తమ ఆలోచన, ఇది సాధ్యం చేయగలమని భావిస్తున్నట్లు రజనీశ్ అన్నారు. ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చిన యోనో వంటి యాప్ల ద్వారా, దేశీయంగా డెబిట్కార్డుల వినియోగాన్ని తగ్గించగలమనే అభిప్రాయాన్ని రజనీశ్ వ్యక్తం చేశారు. ఇది ఆచరణలోకి వస్తే భవిష్యత్ లో ఏటీఎం కార్డులకి కాలం చెల్లడం ఖాయమని చెప్పవచ్చు.