వైరల్ : టైగర్ గ్రేట్.. 200కేజీలు ఎత్తాడు
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్ గా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడు. డ్యాన్సుల్లోనూ అదరగొడుతాడు. పలు సందర్భాలు ఆయన విడుదల చేసిన డ్యాన్స్ వీడియోలకి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఐతే, ఈసారి టైగర్ షేర్ చేసిన జిమ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో టైగర్ ఏకంగా 200కేజీల బరువుని ఎత్తడం చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోని 17 లక్షల మందికి పైగా వీక్షించారు. నిజమైన టైగర్, అద్భుతం, ఇది ఎలా సాధ్యమైంది, గ్రేట్.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలు, ఫిటినెస్ మాత్రమే కాదు. ఎఫైర్స్ నడపడంలోనూ టైగర్ దిట్ట. లోఫర్ హీరోయిన్ దిశా పటానీతో టైగర్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పార్టీలు, పబ్ లకి తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెళ్లి వరకు వెళ్తారేమో చూడాలి. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ ‘వార్’ చిత్రంలో నటిస్తున్నారు.