అమరావతిలోని లేని భయం.. హైదరాబాద్’లో ఎందుకో ?
హైద్రాబాద్‌లో నవంబర్ 28 నుంచి 30వ ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్’ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, కర్ణసేన హెచ్చరికల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తెలిపింది. ఈ సమ్మిట్’లో భాగంగా ‘హాలీవుడ్ టు నోలీవుడ్ టు బాలీవుడ్’ అనే అంశం గురించిన చర్చలో దీపికా పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడీమె రాలేనని చెప్పడంతో.. ఆమె స్థానంలో మరో హీరోయిన్’ని ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.
‘పద్మావతి’ ఎఫెక్ట్’తోనే దీపికా హైదరాబాద్ టూర్ ని క్యాన్సిల్ చేసుకొన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఇటీవలే ఆమె ఏపీ రాజధాని అమరావతిలో సందడి చేశారు. అక్కడ వచ్చి ఓ అవార్డుని స్వీకరించి ఎంతో ప్రశాంతంగా వెళ్లారు. అమరావతికి హాయిగా వచ్చి వెళ్లిన దీపికకు హైదరాబాద్ రావడానికి ఇబ్బందులేంటో అర్థకావడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, పద్మావతి విషయంలో తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తం అయిన మాట వాస్తవమే.
టీ-బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ‘పద్మావతి’ సినిమా రిలీజ్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే, ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్’కు హాజరుకావడానికి వచ్చిన దీపికా పై వారు నిరసన తెలుపుతారని భయపడటంలో అర్థంలేదని అంటున్నారు. మొత్తానికి.. అమరావతితో పోల్చితే హైదరాబాద్ విషయలో హీరోయిన్ దీపికా పదుకొనె చిన్న చూపు చూస్తుందన్న విషయం అర్థమవుతోంది.