షాక్ : అబితాబ్ లివర్ పాడైందట
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అరోగ్యం గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. అమితాబ్ లివర్ 75శాతం పాడైంది. ఆయన 25శాతం లివర్ తో జీవనం సాగిస్తున్నారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా బిగ్ బీ నే తెలిపారు. ‘స్వస్థ్ ఇండియా’ అనే కార్యక్రమంలో పాల్గొన్నఅమితాబ్ తన ఆరోగ్య పరిస్థితు గురించి వివరించారు. టీబీ సోకిన 8యేళ్ల వరకు తనకు ఆ విషయమే తెలియదు. చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో అది బయటపడిందన్నారు. దీంతో నా 75 శాతం లివర్ పాడైపోయింది. ప్రస్తుతం 25శాతం లివర్ తోనే జీవితం కొనసాగిస్తున్నాననారు బిగ్ బీ.
ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను ముందే గుర్తించి.. సులభంగా ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి వీలుగా ఉంటుందని బిగ్ బీ సూచించారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటేనే మనలో ఉన్న వ్యాధులు బయటపడతాయన్నారు. బిగ్ బీ నటించిన తెలుగు చిత్రం ‘సైరా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బిగ్ బీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో నటించారు. కొద్దిసేపటి క్రితమే సైరా టీజర్ విడుదలైంది.