చిదంబరం అరెస్ట్.. !


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంని ఏ క్షణమైనా అరెస్ట్ చేయనున్నారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు రూ.305కోట్లు విదేశీ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలని ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన పాత్రపై సీబీఐ, ఈడీ సంస్థలు పలుమార్లు విచారించాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ ఆయన పెట్టుకొన్న పిటిషన్ ని ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది.

ఆరుగురు సీబీఐ అధికారుల బృందం ఢిల్లీలోని చిదంబరం నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగినట్టు సమాచారం. ఏ క్షణమైన చిదంబరంని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు, ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని చిదంబరం తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్టు సమాచారమ్.