ఎన్టీఆర్ పక్కన హాలీవుడ్ యంగ్ హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇందులో రామ్ చరణ్ అల్లూరిగా, ఆయనకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఆయనకి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ని తీసుకొన్నారు. ఐతే, ఆమె సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది.

అప్పటి నుంచి తారక్ కోసం హీరోయిన్ వేట కొనసాగిస్తున్నారు రాజమౌళి. దక్షిణాది హీరోయిన్ ని తీసుకొనేందుకు ట్రై చేశారు. నిత్యామీనన్ కి మేకప్ టెస్ట్ కూడా చేశారు. కానీ, రాజమౌళి సంతృప్తి చెందలేదు. ఫైనల్ గా మరో హాలీవుడ్ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యంగ్ హీరోయిన్ ని తారక్ కోసం ఎంపిక చేశారట. ఆమె ఎవరు ? అన్నది తెలియాల్సి ఉంది. ఆమె తదుపరి షెడ్యూలో షూటింగ్ జాయిన్ కానుందని సమాచారమ్. ఇక, ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.