మెగాస్టార్ అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చా : పవన్


ఆగస్టు 22 – మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. జీవితంలో నా స్ఫూర్తి ప్రదాత అన్నయ్య. ఓ అభిమానిగా ఆయన్ని ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకున్నానో అలాంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు పనిచేశారు. ఒకరు అన్నయ్య, మరొకరు అమితాబ్‌బచ్చన్‌ అన్నారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్న మాట ఎప్పట్నుంచో వింటున్నా. కానీ ఎవ్వరూ ధైర్యం చేయలేదు. రామ్‌చరణ్‌ ధైర్యం చేశాడు. ఈ సినిమా చేస్తే చిరంజీవిగారే చేయాలి, తీస్తే రామ్‌చరణే తీయాలి అనిపించేలా ‘సైరా’ తెరకెక్కింది. ‘సైరా’ లాంటి గొప్ప సినిమాకి గళం ఇవ్వడం నా అదృష్టం అన్నారు.